: ఫోటోల కోసం చెట్లు నాటొద్దు... నేను చూస్తుంటా: చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా మంది ఫోటోలు తీయించుకునేందుకు చెట్లను నాటుతూ, ఆపై వాటిని గురించి పట్టించుకోవడం లేదని తనకు తెలిసిందని, ఇకపై అలా జరిగితే చూస్తూ ఊరుకోబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ, నాటే ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయించనున్నానని, దాని ద్వారా ప్రతి ఆరు నెలలకూ చెట్ల చిత్రాలను తెప్పించి వాటిని పరిశీలిస్తుంటానని వెల్లడించారు. రాష్ట్రంలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాల్సి వుందని, ఇందుకు ప్రతి కార్యకర్తా సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా జలసంరక్షణ, చెట్ల పెంపకంపై మహానాడుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఓ మొక్క నాటాలని, ఎవరైనా చనిపోతే కూడా వారి జ్ఞాపకార్థం ఓ మొక్క నాటి దాన్ని సంరక్షించుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News