: బాలయ్యే కాదు... యనమల, మురళీమోహన్ కూడా కునుకేశారు!
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు వేదికపై నేతల ప్రసంగాలు బోరు కొట్టిస్తున్నాయో లేక పని ఒత్తిడిలో అలసిపోయారోగానీ, నేతలంతా వేదికపైనే ఓ కునుకు తీసేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలు నిద్రపోతున్న చిత్రాలు రాగా, వీరి దారిలోనే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ మురళీమోహన్ నడిచారు. వీరు కూడా మహానాడు వేదికపై కాసేపు నిద్రపోయి సేదదీరారు. ఇక మహానాడులో నేతల కునుకుపాటులపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటున్నారు.