: ఒట్టి చేతులతో మెడలు విరిచేయగలం: తృణమూల్ కు పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ తీవ్ర హెచ్చరిక


ఏ విధమైన ఆయుధాలు లేకుండా, ఒట్టి చేతులతోనే మెడలు విరిచేంత శక్తి తమకుందని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కోల్ కతాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై మండిపడ్డారు. "మేము ఆర్ఎస్ఎస్ నుంచి శిక్షణ తీసుకున్నాం. ఉత్త చేతులతో మెడలు విరిచేయగలం. తృణమూల్ కార్యకర్తల ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేస్తాం. ఆపై ఏం చేయగలరో చూస్తాం. మాకు 3 సీట్లున్నాయి. మీకు సవాల్ విసిరేందుకు ఆ మాత్రం బలం చాలు" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం నాడు వెస్ట్ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ రెండో దఫా సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, బీజేపీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News