: డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన యువతి!


గతరాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, లీసా అనే యువతి గంటపాటు పోలీసులకు సహకరించకుండా ముప్పు తిప్పలు పెట్టింది. ఏపీ 9 ఏకే 3804 నంబర్ తో ఉన్న హ్యుందాయ్ కారులో పూటుగా మద్యం తాగి, కారులో బీరు బాటిల్స్ తో ఒంటరిగా వచ్చిన ఆమె, తొలుత తాను మద్యం తాగలేదని, కెమెరాలు ఆపాలని నానా హంగామా చేసింది. బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. చివరికి సీఐ రంగ ప్రవేశం చేసి, మహిళా కానిస్టేబుళ్లతో ఆమెను అదుపు చేసి పరీక్షించగా, ఆమె రక్తంలో 98 ఎంజీ/ 100 ఎంఎల్ స్థాయిలో మద్యం ఉన్నట్టు తేలింది. ఎక్కువ మోతాదులో మద్యం సేవించిన కారణంగా కారును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో భాగంగా 16 మంది తాగి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించామని, వీరిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News