: ప్రియమణికి నిశ్చితార్థం అయింది!
ప్రముఖ సినీ నటి ప్రియమణికి నిశ్చితార్థం జరిగింది. గత కొంత కాలంగా సినిమా అవకాశాలు తగ్గిన ప్రియమణి, మలయాళం, తమిళ టీవీ చానెల్స్ లో కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న ప్రియమణికి బెంగళూరులోని బనశంకరిలోని స్వగృహంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారి, ప్రియుడు ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ, చాలా కాలంగా తాము ప్రేమలో ఉన్నామని, ఆడంబరాలకు దూరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నామని ప్రకటించింది. కాగా, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్రియమణి మంచి నటిగా పేరుతెచ్చుకుంది.