: 'నాగశౌర్య ఏం రాశాడో చూడండి' అంటున్న శ్రీనివాస్ అవసరాల
టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య, నట, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మధ్య మంచి అనుబంధం ఉంది. తనకు సోలో హీరోగా అవకాశమిచ్చిన శ్రీనివాస్ అవసరాల అంటే నాగశౌర్యకు చాలా ఇష్టం. అలాగే, తాను దర్శకుడిగా మారి తీసిన సినిమాలో అద్భుతంగా నటించి సూపర్ సక్సెస్ అందించిన నాగశౌర్య అంటే శ్రీనివాస్ అవసరాలకు ప్రత్యేక అభిమానం. వీరిద్దరూ కలిసి మరోసారి 'జో అచ్యుతానంద' సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నాగశౌర్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన శ్రీనివాస్ అవసరాల...'నేను నాగశౌర్య కోసం రెండు కథలు రాస్తే...నాగశౌర్య ఏం రాశాడో చూడండి' అంటూ అభిమానులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఫోటోలో శ్రీనివాస్ అవసరాల చేతికట్టుతో వుండగా.. దానిపై 'సువర్ణ' అని రాసివుంది. నాగశౌర్య చేతిలో స్కెచ్ పెన్నులు ఉండడంతో అతనే ఇది రాశాడని మనం అనుకోవాలి. అయితే, ఇంతకీ ఈ 'సువర్ణ' ఎవరో వారిద్దరే చెప్పాలి!