: వాళ్లిద్దరి గురించి ఏం చెప్పగలం...మ్యాచ్ లాగేసుకున్నారు అంతే!: రైనా నిర్వేదం


ఐపీఎల్ సీజన్ 9లో అత్యంత దురదృష్టకరమైన జట్టు గుజరాత్ లయన్స్, అత్యంత దురదృష్టవంతుడైన కెప్టెన్ ఎవరంటే సురేష్ రైనా అని చెప్పవచ్చు. కుమార్తె (గ్రాసియా) పుట్టిందన్న ఆనందంలో మునిగితేలుతున్న రైనా, జట్టు ప్రదర్శనతో సెమీ ఫైనల్ కు నెంబర్ వన్ జట్టుగా చేరడంపై సంతోషం వ్యక్తం చేశాడు. అయితే సెమీఫైనల్ లో జట్టుగా రాణించిన గుజరాత్ లయన్స్ ను ఏబీ డివిలియర్స్ దారుణంగా దెబ్బ కొట్టాడు. గేల్, కోహ్లీ, రాహుల్, వాట్సన్ పెవిలియన్ చేరిన దశలో స్పిన్నర్ అబ్దుల్లాను అండగా చేసుకున్న డివిలియర్స్ చెలరేగిపోయాడు. గెలుస్తారనుకున్న మ్యాచ్ ను డివిలియర్స్ లాగేసుకున్నాడు. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లో తొలుత తడబడినా ఫించ్ తదితర ఆటగాళ్ల చలవతో విజయానికి అవసరమైన స్కోరు సాధించిన దశలో... ధావన్, యువరాజ్ వంటి స్టార్లను పెవిలియన్ కి పంపి, 'ఇక మ్యాచ్ మనదే' అనుకుంటున్న దశలో ఆల్ రౌండర్ బిపుల్ శర్మను అండగా చేసుకుని చెలరేగిన వార్నర్ అమాంతం మ్యాచ్ ను లాగేసుకున్నాడు. దీంతో రైనా నిర్వేదం వ్యక్తం చేశాడు. ఈ రెండు మ్యాచ్ లను వారిద్దరూ లాగేసుకున్నారని, అలా ఆడితే ఎవరైనా చిత్తు కావాల్సిందేనని రైనా అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News