: కదిలిన బ్రెజిల్ ప్రభుత్వం... నలుగురికి అరెస్టు వారెంట్లు జారీ
ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గ్యాంగ్ రేప్ పై బ్రెజిల్ ప్రభుత్వం కదిలింది. ఈ ఘటనతో ప్రమేయమున్న నలుగురికి అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వాధికారులు నిందితులను పట్టుకునేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. దోషులను శిక్షిస్తామని అన్నారు. ఇప్పటికే బాలికకు వైద్యసాయం అందిస్తున్నామని చెప్పారు. గ్యాంగ్ రేప్ పై బ్రెజిల్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.