: ఒలింపిక్స్ కు సిద్ధమవుతున్న దశలో రియోలో మిన్నంటుతున్న ఆందోళన


ఒలింపిక్స్ నిర్వహించేందుకు బ్రెజిల్ ప్రధాన పట్టణం రియో డీ జెనీరో సిద్ధమవుతోంది. మరోపక్క, అక్కడ తాజాగా వెలుగు చూసిన అత్యాచార ఘటనలో నిందితులను ఉరితీయాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలో 16 ఏళ్ల యువతిని 33 మంది కామాంధులు అత్యంత రాక్షసంగా అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. నిస్సహాయంగా ఉన్న ఆమెపై అఘాయిత్యం చేసిందేకాక, ఈ ఘనకార్యాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో రియోలో ఆందోళనలు చెలరేగాయి. సాక్ష్యాలు ఉన్నప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోలేదని, తక్షణం వారిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఉద్యమిస్తున్నారు.

  • Loading...

More Telugu News