: రాజకీయ ప్రముఖులతో ముద్రగడ భేటీ.. మరో ఉద్యమానికి సిద్ధమని సీఎంకి హెచ్చరిక
కాపు వర్గాన్ని బీసీల్లో చేర్చే డిమాండుతో ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేర్చాలని డెడ్‌లైన్ విధించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఏపీసీసీ అధ‌్యక్షుడు రఘువీరా రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆయన రఘువీరా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మరో కాంగ్రెస్ నేత, సినీనటుడు చిరంజీవిని ఆయన కలిశారు. చంద్రబాబు నాయుడు ఆగస్టులోగా మంజునాథ కమిషన్ నివేదికను తెప్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీపై మాట నిలుపుకోకపోతే ఉద్యమానికి సిద్ధమేనని ముద్రగడ ప్రకటించారు. ఆయన మరికాసేపట్లో దాసరి నారాయణరావును, బొత్స సత్యనారాయణను విడివిడిగా కలవనున్నట్లు సమాచారం.