: రోగులు మెట్రో రైళ్లలోకి రావద్దు: ఢిల్లీ మెట్రో అధికారులు
మానసిక రోగులు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఇతర అంటువ్యాధులు ఉన్న వాళ్లు ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణించవద్దంటూ అధికారులు అక్కడి స్టేషన్లలో పోస్టర్లు అంటించడం వివాదాలకు తావిస్తోంది. ఒక వేళ అంటువ్యాధులు ఉన్నవాళ్లు రైళ్లలో ప్రయాణం చేయదలిస్తే ‘ఇతరులకు తమ వ్యాధి అంటదు’ అని సర్టిఫికెట్ చేత పట్టుకొని రావాలని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో జారీ చేసిన ఈ ఆదేశాలపై పలు స్వచ్ఛంద సంస్థలు మండిపడుతున్నాయి. ప్రయాణికుల పట్ల వివక్ష చూపడమేంటంటూ వ్యతిరేకత తెలుపుతున్నాయి. అధికారుల ఆదేశాలు సమాజంలోని పౌరుల హక్కులను కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.