: నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భూ ప్రకంపనలు!... భయంతో పరుగులు తీసిన జనం!
ఏపీలోని ప్రకాశం జిల్లాను భూకంపాల భయం వీడటం లేదు. ఇప్పటికే ఆరు నెలల్లో ఆ జిల్లాలో 12 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా ప్రకాశం జిల్లాతో పాటు ఆ జిల్లా పొరుగునే ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ భూమి కంపించింది. నేటి తెల్లవారుజామున ఈ రెండు జిల్లాల్లో పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాలు, ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ఇళ్లల్లోని జనం ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూ ప్రకంపనల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు.