: భార్య డామినేట్ చేస్తే భర్తకే లాభమట!
కుటుంబంలో తీసుకునే నిర్ణయాల్లో భర్త లేదా భార్యల్లో ఎవరిదో ఒకరిది పైచేయిగా ఉంటుంది. అయితే భార్యది పైచేయి అయిన కుటుంబాల్లో భర్తకు మధుమేహం వచ్చే అవకాశం లేదని తాజా అధ్యయనం చెబుతోంది. దాంపత్య జీవితం, అనారోగ్యంపై మిచిగాన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయని పరిశోధకులు తెలిపారు. సంసార జీవితంలో సంతృప్తిగా ఉన్న భర్తల కంటే అసంతృప్తిగా ఉన్న భర్తల ఆరోగ్యం బాగున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇంట్లో అన్ని విషయాల్లో ఆధిపత్యం చూపించే మహిళలు భర్తల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని వారి పరిశోధనలో తేలింది. ఒకవేళ అప్పటికే డయాబెటిస్ వచ్చినట్టయితే దానిని అదుపులో ఉంచుకునేలా సతాయిస్తారని పరిశోధన చెప్పింది. సుమరు 1288 సంసారాలను అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. ఇదే సూత్రం మహిళలకు కూడా వర్తించదని, మహిళల వరకు వచ్చేసరికి ఇది రివర్స్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సంసార జీవితంలో సంతృప్తిగా ఉన్న మహిళలకు డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువని తెలుస్తోంది. రిలేషన్ షిప్ విషయంలో పురుషుల కంటే మహిళలు సెన్సిటివ్ గా ఉండడం వల్లే ఇలా జరుగుతుందని వారు వెల్లడించారు.