: కోహ్లీ విజయరహస్యం అదే: సచిన్ టెండూల్కర్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ లో ప్రత్యేకమైన టాలెంట్ ఉండటంతో పాటు, నిరంతరం శ్రమిస్తూ ఉండటమే అతని విజయరహస్యమని అన్నాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో కోహ్లీ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడని కొనియాడాడు. కోహ్లీ ఆటతీరు విషయానికొస్తే, స్ట్రయిట్ బ్యాట్ తో ఆడే విధానం చాలా బాగుంటుందని, కచ్చితమైన షాట్లతో అలరించే విరాట్ టెక్నిక్ విషయంలో ఎప్పుడూ రాజీ పడడని సచిన్ కితాబిచ్చాడు.