: ‘పతంజలి’ ప్రకటనల్లో అవాస్తవాలు: హెచ్చరించిన ఏఎస్సీఐ
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ ‘పతంజలి’ తమ ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) హెచ్చరించింది. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని 'ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' మందలించింది. ‘పతంజలి’ ఉత్పత్తులు కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేశ్ కాంతి నేచురల్ హెయిర్ క్లీన్సర్ తదితర ప్రకటనలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్డ్ ప్రాసెస్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని ‘పతంజలి’ చేస్తున్న ప్రచార ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం ఎఫ్ఎస్ఎస్ఐ, ఏఎస్సీ కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై పతంజలి సంస్థ అధికారులు స్పందించాల్సి ఉంది.