: రాహుల్ గాంధీ సన్నాఫ్ రాజీవ్ గాంధీ.. ఉత్తరప్రదేశ్ డ్రైవర్ చేసిన తుంటరి పని!


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ సమీపంలోని ఇందూపూర్ లో ఓ డ్రైవర్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం అధికారులకు దరఖాస్తు సమర్పించాడు. అందులో తన పేరు రాహుల్ గాంధీ అనీ, తండ్రి రాజీవ్ గాంధీ అని పేర్కొన్నాడు. పైగా, వృత్తి రాజకీయాలని పేర్కొన్నాడు. దీంతో ఈ చిరునామా పరిశీలించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని ఇందూపూర్ లోని సన్ సిటీలో ఉండే డ్రైవర్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలా ఎందుకు రాశావంటే, 'సరదా కోసమే' అని సదరు తుంటరి డ్రైవర్ నవ్వుతూ చెబుతున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News