: హెడ్ లైన్స్ కోసం గేల్ ను టార్గెట్ చేస్తున్నారు: డారెన్ స్యామి
న్యూస్ పేపర్లలో హెడ్ లైన్స్ కోసమే క్రిస్ గేల్ ను మీడియా టార్గెట్ చేస్తోందని వెస్టిండీస్ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ స్యామి తెలిపాడు. గేల్ వ్యాఖ్యలపై విచారణ చేపడతామని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించడంపై స్యామి మాట్లాడుతూ, గేల్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసన్నాడు. మైదానంలో గేల్ ఏం చేశాడన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. మైదానంలో గేల్ అద్భుతమైన ఆటగాడని కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తానెప్పుడూ గేల్ కు మద్దతుగా నిలబడతానని స్యామి పేర్కొన్నాడు. క్రికెటర్లుగా తమకు మైదానంలో ఒక బాధ్యత ఉందని, మైదానంలో తమ ప్రవర్తనను అభిమానులు గమనిస్తుంటారని తమకు తెలుసని పేర్కొన్నాడు. మైదానం బయట జరిగిన దానిని వదిలెయ్యమని చెప్పాడు. గేల్ క్రికెట్ హీరో అని, మైదానంలో వినోదం కలిగిస్తాడని స్యామి తెలిపాడు.