: రూములు సర్దుకుని ఖాళీ చేసి భక్తులకు ఇచ్చేయండి: చంద్రబాబు సలహా
తెలుగుదేశం మహానాడు సందర్భంగా తిరుపతి, తిరుమలలోని టీటీడీ అతిథి గృహాలు, ప్రైవేటు హోటళ్లలోని గదులన్నింటినీ కార్యకర్తలు, వీఐపీల కోసం బ్లాక్ చేయగా, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వస్తున్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. రెండు, మూడు గదులు ఒకే చోట తీసుకున్న ఒక ప్రాంతం వారు ఒకదానిలోనే సర్దుకుని మిగతా గదులను భక్తులకు ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేదిక వద్ద ఉండే కార్యకర్తలకు గదుల అవసరం ఉండబోదని అభిప్రాయపడ్డ ఆయన, భక్తులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. వెంకన్న స్వామి తెలుగుదేశం వెంటే నిలిచివుంటారని, భవిష్యత్తులోనూ అది కొనసాగేందుకు తాను చెప్పిన మాటలను సహృదయంతో విని పాటించాలని సూచించారు.