: తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కు చెరిగిపోని స్థానం... కార్యకర్తలకు పాదాభివందనం: చంద్రబాబు


టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’లో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆవేశపూరిత ప్రారంభోపన్యాసం చేశారు. ఉపన్యాసం ప్రారంభంలోనే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును ప్రస్తావించిన చంద్రబాబు... దివంగత సీఎంకు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థానం దక్కిందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలకు బీజం పడిందన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు తెలుగు ప్రజలకు పండగేనన్నారు. రాష్ట్రంలోని వివిధ మతాలకు వివిధ పండుగలుంటే... తెలుగు ప్రజలందరూ కలిసి చేసుకునే పండుగ మహానాడేనని ఆయన చెప్పారు. టీడీపీని త్యాగాలకు పెట్టింది పేరుగా ఆయన అభివర్ణించారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను పరిచయం చేసుకున్న చంద్రబాబు... పార్టీని మోసిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. సొంత కుటుంబం కంటే పార్టీని, పార్టీ కార్యకర్తలను మిన్నగా చూసుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు, జెండాలు వచ్చినట్టే వచ్చి కనుమరుగు కాగా... నిలిచి గెలిచింది టీడీపీనేనన్నారు. పార్లమెంటులో ఏకైక ప్రదాన ప్రతిపక్షంగా కొనసాగిన ప్రాంతీయ పార్టీ కూడా టీడీపీనేనన్నారు. హైదరాబాదును ప్రపంచ పటంలో నిలిపింది కూడా టీడీపీనేనని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన పార్టీ కూడా టీడీపీనే అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News