: నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ‘ఓటుకు నోటు’ నిందితుడు జెరూసలెం మత్తయ్య అరెస్ట్!


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక నిందితుడైన జెరూసలెం మత్తయ్యను తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా హైదరాబాదును వదిలి నవ్యాంధ్రకు తరలివెళ్లిన మత్తయ్య... హైకోర్టును ఆశ్రయించిన వైనం గతంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన తర్వాతే ఆయన హైదరాబాదులో అడుగుపెట్టారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకున్న మత్తయ్య... నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తనదైన శైలిలో చేతివాటం ప్రదర్శించారట. ఉద్యోగాల పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్న మత్తయ్య... ఉద్యోగాలిప్పించడంలో చేతులెత్తేశారు. దీనిపై ఫిర్యాదునందుకున్న హైదరాబాదు పోలీసులు నిన్న రాత్రి ఆయనను నగరంలోనే అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News