: ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని నిర్ణయమే ఫైనల్ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు


ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయమే ఫైనల్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒక ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, ఏపీకి ప్రత్యేక హోదాపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి సాయం చేయకపోతే ఒరిగేదేమి ఉండదని అన్నారు. రెండేళ్ల పాలనలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో రాబోయే రోజుల్లో విప్లవవాత్మక మార్పులు వస్తాయన్నారు. ప్రత్యేక హోదాపై అవగాహన లేని కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు తానే అన్నింటినీ వివరిస్తానని చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం... వెంకయ్యనాయుడిని గో బ్యాక్ అనడం... కాదని, ఒకవేళ వెంకయ్యనాయుడు రాజీనామా చేస్తే ఏపీకీ ప్రత్యేక హోదా వస్తుందా? సమస్యలు పరిష్కారమవుతాయా? పరిపక్వత లేని వాళ్లు ఈవిధంగా చేస్తున్నారు’ అని వెంకయ్యనాయుడు ఆవేశంగా అన్నారు.

  • Loading...

More Telugu News