: బాలుడిపై లైంగిక వేధింపులు.. భారతీయ ఫుట్ బాల్ కోచ్ కు జైలు శిక్ష


తన వద్దకు కోచింగ్ కు వచ్చిన విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఒక భారతీయ ఫుట్ బాల్ కోచ్ కు జైలు శిక్ష పడిన సంఘటన దుబాయ్ లో జరిగింది. దుబాయ్ లో నివసిస్తున్న ఒక భారతీయ విద్యార్థికి ఫేస్ బుక్ ద్వారా అక్కడే ఉంటున్న ఓ ఇండియన్ కోచ్ గత ఏడాది పరిచయమయ్యాడు. తనకు ఫుట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని సదరు విద్యార్థి అడగటంతో అందుకు సదరు కోచ్ సరే అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మైదానంలో శిక్షణ ఇస్తుండేవాడు. కొన్ని నెలల తర్వాత విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకసారి.. ఆ విద్యార్థి న్యూడ్ గా ఉన్న సమయంలో ఆ కోచ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత నుంచి తనతో సెక్స్ లో పాల్గొనాలంటూ విద్యార్థిపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. అందుకు, ఆ కుర్రాడు అంగీకరించకపోవడంతో, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కోచ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయన సెల్ ఫోన్ ను చెక్ చేయగా బాలుడి న్యూడ్ ఫొటోలు కనపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశ పెట్టారు. లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ నేరాల కింద భారతీయ కోచ్ కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. కాగా, బాధిత బాలుడు మాట్లాడుతూ, తనతో పాటు మరికొంత మంది విద్యార్థులపై కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఈ మధ్యనే తనకు తెలిసిందని, ఆ తర్వాత అతనికి దూరంగా ఉండటం మొదలు పెట్టానని చెప్పాడు. కోచ్ పిలిచినప్పుడు తాను వెళ్లకపోతే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయపెట్టేవాడని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News