: సంబరాల్లో మార్కెట్ వర్గాలు... 8 వేలు దాటి దూసుకెళుతున్న నిఫ్టీ


గత సంవత్సరం నవంబరులో 8 వేల పాయింట్ల స్థాయి నుంచి జారిపోయిన తరువాత, తొలిసారిగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిప్టీ 8000 పాయింట్లను దాటి దూసుకెళుతోంది. నేటి మార్కెట్ సెషన్ ఆరంభం నుంచే లాభాల్లో ఉన్న నిఫ్టీ, అందరూ ఊహించినట్టుగానే మధ్యాహ్నం తరువాత మరింత పైకి ఎక్కింది. దీంతో ఇన్వెస్టర్ వర్గాలు, బ్రోకర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అటు ముంబైలోని బీఎస్ఈ కార్యాలయంలో, ఇటు ఢిల్లీలోని ఎన్ఎస్ఈ కార్యాలయంలో ట్రేడర్లు మిఠాయిలు పంచుకున్నారు. మధ్యాహ్నం 3:20 గంటల సమయంలో నిఫ్టీ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 137 పాయింట్లు పెరిగి 8,072 పాయింట్లకు చేరుకుంది. సెషన్ ముగిసేలోగా 8,100 పాయింట్ల వరకూ నిఫ్టీ చేరుకోవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News