: కలెక్టర్లు, ఎస్పీలపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కేంద్రం కత్తెర!


సర్వీస్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాల్లోని అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠంగా నెల రోజుల పాటు మాత్రమే విధుల నుంచి పక్కన పెట్టగలుగుతుంది. అది కూడా సస్పెండ్ చేసిన 48 గంటల్లోగా కేంద్రానికి తెలియజేయాల్సి వుంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తే, ప్రధాని అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రాష్ట్రాల అధికారాలకు కోత విధిస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమ మాట వినని అధికారులపై బదిలీలు, సస్పెన్షన్ అస్త్రాలను ప్రయోగించి వేధిస్తున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్రం ఈ ఉత్తర్వులను వెలువరించింది. ఇదిలావుండగా, జువైనల్ చట్టానికి సవరణ చేయాలని భావిస్తూ, తయారు చేసిన ముసాయిదాను కూడా కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం, 18 ఏళ్లలోపు బాలలకు బేడీలు వేయకూడదు. జైలుకు పంపరాదు. వీరిని లాకప్ లో కూడా ఉంచకూడదు. ప్రతి రాష్ట్రంలో బాల నేరస్తుల సంరక్షణ కోసం కనీసం ఒక్క గృహాన్నైనా నిర్మించాల్సి వుంది.

  • Loading...

More Telugu News