: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి సాయిరెడ్డే!... అధికారికంగా ప్రకటించిన వైఎస్ జగన్
రాజ్యసభ ఎన్నికల్లో తనకు దక్కనున్న సింగిల్ సీటుకు వైసీపీ... తన అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. మరికాసేపట్లో సాయిరెడ్డిని తన వెంట అసెంబ్లీకి తీసుకువెళ్లనున్న జగన్ ఆయనతో నామినేషన్ వేయించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా హాజరుకానున్నారు.