: నేను ఇంతవరకు చేయని పాత్రలో నటించాను: నటుడు రావు రమేష్
ఏ సినిమాలోనూ ఇంతవరకు చేయని పాత్రను ‘బ్రహ్మోత్సవం’లో చేశానని ప్రముఖ నటుడు రావు రమేష్ అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో తాను తండ్రి పాత్రలు పోషించానని, అయితే, దేనికదే ప్రత్యేకమని... ‘బ్రహ్మోత్సవం’లో తన పాత్ర మరింత ప్రత్యేకమని చెప్పారు. మెంటాలిటీ పరంగా పండిపోయిన నటీనటులతో కలిసి ‘బ్రహ్మోత్సవం’లో నటించానని, చాలా నేర్చుకున్నానని చెప్పారు. అన్నం రోజూ తింటున్నా ఎలా విసుగుపుట్టదో, అలాగే కుటుంబం, కుటుంబ సంబంధాల నేపథ్యంలో తీసిన చిత్రాలు కూడా విసుగుపుట్టవని రావు రమేష్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.