: రాజ్యసభ సీటు కావాలని బీజేపీ అడగలేదు: స్పష్టం చేసిన లోకేష్


తమకు తెలుగుదేశం కోటా నుంచి ఒక రాజ్యసభ సీటు కావాలని బీజేపీ కోరలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో లోకేష్ చిట్ చాట్ చేశారు. ఒకవేళ ప్రతిపాదన వస్తే ఇస్తారా అన్న విషయానికి, లోకేష్ సూటిగా సమాధానం చెప్పలేదు. ఊహాజనిత ప్రశ్నలు వద్దని, బీజేపీ అడిగినప్పుడు, పరిస్థితిని బట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కేంద్రంలో కలిసి సాగుతాయని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా సాధించుకుంటామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు గుప్పిస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News