: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు షురూ!... ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు
వరుసగా రెండో పర్యాయం అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వెనువెంటనే కార్యరంగంలోకి దిగిపోయారు. తాను సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే ఆమె అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. నేటి ఉదయం ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు సభలో సభ్యులుగా ప్రమాణం చేశారు.