: కేంద్ర మంత్రుల రాకపై ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులు రేపు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. ఏపీలో అధికారాన్ని అప్పజెప్పే స్థాయిలో ఇక్కడి ప్రజలు బీజేపీపై అభిమానాన్ని చూపెడుతున్నారని ఈ సందర్భంగా ఆ పార్టీనేతలు మీడియాతో అన్నారు. రాష్ట్రానికి పదిమంది కేంద్రమంత్రులు రానున్నారని, ఏ పార్టీ అయినా తమ బలోపేతంపై దృష్టి పెడుతుందని, ప్రస్తుతం ఏపీలో బీజేపీని బలపర్చే బాధ్యత తమకు ఉందని ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. విజయ పర్వయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తామని తెలిపారు.