: తలసరి ఆదాయంలో ఫస్ట్, లాస్ట్ స్థానాలు ఉత్తరాంధ్ర జిల్లాలవే!


ఏపీ ఆర్థిక అభివృద్ధి నివేదికను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. విజయవాలో నేటి ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో భాగంగా చంద్రబాబు ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో రాష్ట్ర తలసరి ఆదాయంలో నెలకొన్న వైరుధ్యాలను చంద్రబాబు వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,07,532 గా నమోదైంది. అదే సమయంలో తలసరి ఆదాయంలో టాప్, అట్టడుగు స్థానాల్లో నిలిచిన రెండు జిల్లాలు కూడా ఉత్తరాంధ్రకు చెందినవే కావడం గమనార్హం. రూ.1,40,648 తలసరి ఆదాయంతో విశాఖ జిల్లా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిస్తే... విశాఖకు సమీపంలోని శ్రీకాకుళం జిల్లా రూ.74,638తో చివరి స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విజయవాడ ఉన్న కృష్ణా జిల్లా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా తలసరి ఆదాయం రూ.1,40,593గా నమోదైంది. ఇక కృష్ణా జిల్లాకు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా రూ.1,21,724తో మూడో స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News