: కేపీహెచ్ బీలో క్రికెట్ బెట్టింగ్!... ఎస్ఓటీ పోలీసుల దాడి, ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్


జెంటిల్మన్ గేమ్ క్రికెట్ ను బెట్టింగ్ రాక్షసి అతలాకుతలం చేస్తోంది. పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాలకూ విస్తరించిన బెట్టింగ్ లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ను ఆసరా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. హైదరాబాదులోని కేపీహెచ్ బీ కాలనీ వసంత్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ పై ఎస్ఓటీ పోలీసులు నేటి ఉదయం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఐదుగురు సభ్యులు కలిగిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, 6 సెల్ ఫోెన్లు, మూడు ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News