: అన్నాడీఎంకేలో విషాదం!... గుండెపోటుతో పార్టీ ఎమ్మెల్యే మృతి


మూడు దశాబ్దాల తర్వాత వరుసగా రెండో పర్యాయం అధికారం నిలబెట్టుకుని తమిళనాట అన్నాడీఎంకే రికార్డు నెలకొల్పింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మొన్న అట్టహాసంగా సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. సెకండ్ టెర్మ్ అధికార పగ్గాలు చేపట్టిన ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివేల్ (65) గుండెపోటుతో చనిపోయారు. తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివేల్ గతవారం గుండెనొప్పితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆయన నేటి ఉదయం కన్నుమూశారు. దీంతో సంబరాల్లో మునిగితేలుతున్న అన్నాడీఎంకేలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News