: జమ్మూ క్యాంపస్ నుంచి ఏబీవీపీ బహిష్కరణపై మండిపడుతున్న బీజేపీ


జమ్మూ యూనివర్శిటీ క్యాంపస్ నుంచి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్)ని బహిష్కరించడం, బీజేపీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన సంఘటనల అనంతరం ఏబీవీపీపై నిషేధం విధించగా, దాన్ని ఇంతవరకూ తొలగించలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ మంత్రులు, జమ్మూ వైస్ చాన్సలర్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఈ విషయమై ఆ పార్టీ నేత రాంమాధవ్ స్పందిస్తూ, ఏబీపీవీకి వ్యతిరేకంగా వీసీ చర్యలపై కఠిన చర్యలు తీసుకోనున్నామని ట్వీట్ చేశారు. కాగా, ఒక్క ఏబీవీపీని మాత్రమే బహిష్కరించామనడం తప్పని, వర్శిటీలోని అన్ని విద్యార్థి సంఘాలనూ నిషేధించామని, రాజకీయ లింకులున్న విద్యార్థి సంఘాలకు ఇది వర్తిస్తుందని వైస్ చాన్సలర్ ఆర్డీ శర్మ వివరించారు. మిగతా అన్ని విద్యార్థి సంఘాలూ వర్శిటీ నిర్ణయానికి ఆమోదం పలుకగా, ఏబీవీపీ మాత్రం వ్యతిరేకిస్తోందని అన్నారు. దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో ఏబీవీపీ ఉందని, విద్యార్థి సంఘాలు విద్యార్థుల ప్రయోజనాల కోసమే తప్ప వర్శిటీ కోసం కాదని జమ్మూ యూనివర్శిటీ ఏబీవీపీ అధ్యక్షుడు లఖ్వీందర్ సింగ్ అన్నారు.

  • Loading...

More Telugu News