: మట్టిలో కూరుకుపోయిన చంద్రబాబు బస్సు... నడచి వెళ్లిన ముఖ్యమంత్రి
నవ్యాంధ్రలో నిర్మాణంలో ఉన్న సచివాలయం సందర్శన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రత్యేక బస్సులో అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మాణమవుతున్న సచివాలయం బ్లాక్ వద్దకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు మట్టిలో కూరుకుపోయింది. డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ బస్సు కదలలేదు. బస్సు వెనుక భాగంలో ఒక బెల్ట్ కట్టి క్రేన్ ద్వారా లాగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీలేక, చంద్రబాబు బస్సు దిగి నడుచుకుంటూ సచివాలయం బ్లాక్ వద్దకు వెళ్లాల్సి వచ్చింది.