: కష్టాల్లో గుజరాత్ లయన్స్.. 17 ఓవర్లకి 121 పరుగులు
ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. కేవలం 20 పరుగులకే మెక్ కల్లమ్ (1), ఫించ్ (4), రైనా (1) వికెట్లు కోల్పోయిన గుజరాత్ లయన్స్ జట్టును దినేష్ కార్తిక్ (26), డ్వేన్ స్మిత్ (73) ఆదుకున్నారు. కార్తిక్ అవుటైనప్పటికీ డ్వెన్ స్మిత్ ఒక్కడే బౌండరీలు, సిక్సర్లతో రాణించడంతో గుజరాత్ జట్టు 115 పరుగులు చేయగలిగింది. ఈ దశలో రవీంద్ర జడేజా (3), స్మిత్ అవుట్ కావడంతో మళ్లీ గుజరాత్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. క్రీజులో డ్వెన్ బ్రావో (3), ద్వివేదీ (5) ఉన్నారు. ఇప్పటికి 17 ఓవర్లు ఆడిన గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.