: అసోంలో దేశ ప్రధాని సహా 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ప్రధాని నరేంద్ర మోదీ సహా 14 మంది ముఖ్యమంత్రులు అసోంలోని గువాహటీలో సందడి చేశారు. అసోం ముఖ్యమంత్రిగా మాజీ కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులంతా ఆ రాష్ట్రానికి క్యూకట్టారు. దీంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇంత పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రులు హాజరుకావడం విశేషమే. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన పలువురు ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపినప్పటికీ వివిధ కారణాల వల్ల పలువురు హాజరుకాలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలించనున్న రాష్ట్రం కావడంతో ఇంత మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.