: మూడు లక్షల మంది ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది: మెయిజు
తాము ఈ నెల 31న భారత మార్కెట్ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ మాధ్యమంగా విడుదల చేయనున్న ఎం3 నోట్ కోసం 3 లక్షల మందికి పైగా ఎదురుచూస్తున్నారని చైనా సంస్థ మెయిజు ప్రకటించింది. బుకింగ్స్ ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలో అత్యధికులు రిజిస్టర్ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. దీని ధర రూ. 9,999 కాగా, 5.5 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ స్క్రీన్, 1.8 జీహెచ్ ప్రాసెసర్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, గ్రాఫిక్స్ కోసం మాలి-టీ 860 జీపీయూ తదితర ఆకర్షణీయ ఫీచర్లతో ఈ ఫోన్ లభించనుంది. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్ కేవలం 5 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుందట.