: తెలంగాణలో వడదెబ్బకు ఇప్పటి వరకు 315 మంది మృతి
తెలంగాణలో రెండు రోజుల క్రితం వరకు అకాల వర్షాలతో కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. కాగా, తెలంగాణలో ఈ ఏడాది వేసవిలో ఎండల వేడికి ఇప్పటివరకు 315 మంది మృతి చెందారని తాజాగా అధికారులు పేర్కొన్నారు. నల్గొండలో అత్యధికంగా 91మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 37, మహబూబ్ నగర్ 44, మెదక్ 33, ఆదిలాబాద్ 36, రంగారెడ్డి 20 మంది భానుడి తాపానికి మృత్యువాత పడ్డారని చెప్పారు. ఎండలు మళ్లీ తీవ్రస్థాయిలో మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.