: విరసంపై ఖాకీల ఉక్కుపాదం!... డీటీఎఫ్ సభకు వెళుతున్న వరవరరావు సహా పలువురి అరెస్ట్
‘విరసం’గా మనకంతా చిరపరచితమైన విప్లవ రచయితల సంఘంపై ఖాకీల నిర్బంధం కొనసాగుతోంది. నిషేధిత మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తున్నారంటూ జన బాహుళ్యంలోని విరసం నేతలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ సంకెళ్లేస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ లో నేటి సాయంత్రం డెమొక్రటిక్ ప్రజా ఫ్రంట్ (డీటీఎఫ్) నిర్వహిస్తున్న సదస్సుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటలలోగా సదస్సును ముగించాలన్న షరతుతో కోర్టు సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి బయలుదేరిన విరసం నేతలు వరవరరావు, వనమాల తదితరులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.