: ఓ హీరోయిన్ ఇలా కనిపిస్తుంటే మంచి రోజులు వచ్చినట్టే... రాజకీయాలపై ప్రేమ పుట్టింది: రూట్ మార్చిన వర్మ!


సమకాలీన సినిమాలపై సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు పెడుతూ వార్తల్లో నిలిచే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి రాజకీయాలపై దృష్టి పెట్టి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికలను, ఇండియాలో సినిమా హీరోయిన్లు ఎమ్మెల్యేలుగా గెలవడాన్ని ప్రస్తావించాడు. తన జీవితంలో తొలిసారిగా రాజకీయాలపై ప్రేమ పుట్టిందని అన్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని పదవి చేపట్టాలని, ఆపై ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలని, వీరిద్దరూ వైట్ హౌస్ లో కలిస్తే చూడాలని ఉందని తన మనసులోని కోరికను చెప్పాడు. తెలంగాణకు కేసీఆర్, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీ రామారావు ఎలాగో, అమెరికాకు ట్రంప్ అలా అవుతారని, ఆయన్ను బరిలోకి దింపిన అమెరికన్లు, తమలో భారతీయుల ఆలోచనా ధోరణి ఉందని నిరూపించుకున్నారని ట్వీట్ చేశాడు. అసోంలో బీజేపీ తరఫున గెలిచిన నటి అంగూర్ లత పొట్టి డ్రస్సుతో ఉన్న ఫోటోను, ఆపై ఎమ్మెల్యే రూపంలోని ఫోటోను పోస్టు చేస్తూ, ఓ హీరోయిన్ ఇలా కనిపిస్తుంటే సంతోషంగా ఉందని, ఇక 'అచ్చే దిన్' వచ్చినట్టేనని అన్నాడు.

  • Loading...

More Telugu News