: వారంతా పొద్దుతిరుగుడు పువ్వులే!: ‘జంపింగ్’లపై పయ్యావుల సంచలన కామెంట్స్
ఒక పార్టీ టికెట్ పై విజయం సాధించి మరో పార్టీలో చేరే వారిని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పొద్దుతిరుగుడు పువ్వులుగా అభివర్ణించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిన్న జరిగిన మినీ మహానాడులో మాట్లాడిన సందర్భంగా పయ్యావుల ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి కొందరు రాజకీయ నేతలు వస్తుంటారని, వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని పయ్యావుల అన్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరేవారు కొందరు ఉంటారని... పార్టీ ఫిరాయింపుదారులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి కూడా ఇబ్బందులు రావొచ్చని ఆయన డేంజర్ బెల్స్ మోగించారు. పయ్యావుల ప్రసంగిస్తున్నంత సేపు వేదికపైనే ఉన్న కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా (ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే) ఆ తర్వాత సమావేశం ముగియకముందే అక్కడి నుంచి నిష్క్రమించారు.