: మారిన తత్కాల్ బుకింగ్ సమయం... టికెట్ రద్దు చేసుకున్నా డబ్బు వెనక్కి... కొత్త రైల్వే నిబంధనలివే!


భారతీయ రైల్వే శాఖ తత్కాల్, వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల నిబంధనలను సవరించింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ రైళ్లలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించే వికల్ప్ స్కీమును మరింతగా విస్తరించింది. మారిన నిబంధనల ప్రకారం.. * తత్కాల్ టికెట్లను క్యాన్సిల్ చేస్తే, ప్రస్తుతం ఎటువంటి రిఫండ్ రాదు. ఇకపై సగం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. * తత్కాల్ బుకింగ్ సమయమూ మారింది. ఏసీ కోచ్ లకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, స్లీపర్ కోచ్ ల్లో బెర్తుల కోసం 11 నుంచి 12 గంటల వరకూ కౌంటర్లు ప్రత్యేకంగా పనిచేస్తాయి. * రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో మొబైల్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. ఈ రైళ్లలో బోగీల సంఖ్య పెరగనుంది. * సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్టులోని వారికి, తదుపరి అదే రూట్లో వచ్చే రైళ్లలో ఖాళీలను బట్టి బెర్తుల కేటాయింపు. బెర్తు కేటాయించిన తరువాత చార్జీల తేడాలున్నా రిఫండ్ రాదు, అదనపు చార్జీలూ ఉండవు. * గమ్యస్థానం వచ్చే సమయానికి ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు వేకప్ కాల్ సదుపాయం.

  • Loading...

More Telugu News