: వన్డేల నుంచి కోహ్లీ ఔట్!... జింబాబ్వే, విండీస్ టూర్లకు టీమిండియా జట్లు ఎంపిక


జింబాబ్వే, వెస్టిండీస్ లలో త్వరలో పర్యటించనున్న టీమిండియా వన్డే, టెస్టు జట్లను నిన్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి... వన్డే ఫార్మాట్ నుంచి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు, టెస్టు జట్టుకు మాత్రం అతడికే సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక వన్డే జట్టుతో పాటు టెస్టు జట్టులోనూ కొత్త కుర్రాళ్లకు సెలెక్టర్లు ఓటు వేశారు. వన్డే జట్టులో కరణ్ నాయర్, యజ్వేంద్ర చాహాల్ లకు చోటు దక్కగా, టెస్టు జట్టులో కొత్త కుర్రాడు శార్దూల్ ఠాకూర్ అరంగేట్రం చేయనున్నాడు. నిన్న ముంబైలో భేటీ అయిన సెలెక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు సంబంధించి జట్లను వేర్వేరుగా ప్రకటించింది. వన్డే జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, ఫయజ్ ఫజల్, కరణ్ నాయర్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావళ్ కులకర్ణి, జస్ ప్రీత్ బుమ్రా, బరీందర్ స్రాన్, మన్ దీప్ సింగ్, జయదేవ్ ఉనాద్కట్, యజ్వేంద్ర చాహాల్. టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రెహానే, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బిన్నీ.

  • Loading...

More Telugu News