: స్వామిజీ ముసుగు తీసి వైసీపీలో చేరండి!... విశాఖ శారదా పీఠాధిపతిపై బ్రాహ్మణ సంఘాల ఫైర్!


విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై బ్రాహ్మణ సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో స్వరూపానందేంద్ర కుమ్మక్కయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఈ వివాదం వివరాల్లోకెళితే... మొన్న విజయవాడ కేంద్రంగా ‘విప్రోత్సవం’ పేరిట బ్రాహ్మణ సంఘాల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన సందర్భంగా స్వరూపానందేంద్ర... టీడీపీ సర్కారు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ ద్వారా మంజూరవుతున్న రుణాలు టీడీపీకి చెందిన వారికే అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ బ్రాహ్మణ చైతన్య వేదిక కో- కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ నిన్న గుంటూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తో కుమ్మక్కైన స్వరూపానందేంద్ర... పేద బ్రాహ్మణుల కోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా స్వరూపానందేంద్ర చెతితే సీఎం చంద్రబాబు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయలేదని ఆయన దెప్పిపొడిచారు. రాజకీయాలు చేయాలనుకుంటే... స్వామిజీ ముసుగు తీసివేసి వైసీపీలో చేరి బహిరంగంగా మాట్లాడాలని ఆయన స్వరూపానందేంద్రకు సూచించారు.

  • Loading...

More Telugu News