: 'టెర్రరిస్ట్' అంటూ దూషించిన ట్రంప్ మద్దతుదారుకి గట్టి సమాధానమిచ్చిన భారతీయుడు


తనను టెర్రరిస్టుతో పోల్చిన ఒక అమెరికన్ కు సిక్కు కౌన్సిలర్‌ సరైన సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళ్తే... న్యూజెర్సీలోని హోబోకెన్ లార్డ్ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌ లో రవీందర్ భల్లా అనే సిక్కు వ్యక్తి సిటీ కౌన్సిల్ మెంబరుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హోబోకెన్ సిటీ కౌన్సిల్ ఓ 'వాటర్ ఫ్రంట్ మల్టీ యూజ్ పాత్‌ వే' నిర్మాణానికి అంగీకరించింది. ఈ విషయం రవీందర్ భల్లా ట్విట్టర్‌ లో పోస్టు చేసి తన మద్దతుదారులకు తెలిపారు. ఈ ట్వీట్ చూసిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మద్దతుదారుడైన రాబర్ట్ డుబెనెజిక్ స్పందించారు. ‘‘భల్లాను కౌన్సిలర్‌ గా హోబోకెన్ ఎలా అంగీకరించింది? ఇటువంటి టెర్రరిస్టులను యూఎస్‌ లో ఉండేందుకు అనుమతించడమే తప్పు’’ అంటూ ఆయన కామెంట్ చేశారు. దీనికి సమాధానమిచ్చిన రవీందర్ భల్లా ‘‘సర్.. నేను పుట్టింది, పెరిగిందీ అమెరికాలోనే. టెర్రరిస్ట్ అంటే అసలైన అర్థం అమెరికన్‌గా ఉండు’’ అని. బహుశా మీకీ విషయం తెలియదేమో’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో దిమ్మదిరిగిన ట్రంప్ మద్దతుదారు నోరు మూసుకున్నాడు.

  • Loading...

More Telugu News