: గోదావరి జలాల్లో ‘ఉత్తరాంధ్ర’కు న్యాయమైన వాటా ఇవ్వాలి: మాజీ మంత్రి కొణతాల డిమాండ్


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈరోజు లేఖ రాశారు. గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రకు న్యాయమైన వాటా ఇవ్వాలని కొణతాల డిమాండ్ చేస్తూ ఈ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురిసినప్పటికీ తాగు, సాగు నీటి కోసం ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో 16 చిన్న, మధ్య తరహా నదులు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని, ఇక్కడి కరవు పరిస్థితులకు చెక్ పెట్టేందుకుగాను నదుల అనుసంధానమే పరిష్కారమని ఆ లేఖలో కొణతాల కోరారు.

  • Loading...

More Telugu News