: మహారాష్ట్రలోని మరట్వాడా డ్యాముల్లో నీళ్లు నిల్!
మహారాష్ట్ర కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. మహారాష్ట్ర అధికారులు, ప్రజలు రానున్న వర్షాకాలంపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అక్కడి మరట్వాడాలోని డ్యాముల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే నీళ్లు మిగిలాయని ఔరంగాబాద్ డివిజన్ కమిషనర్ ఉమాకాంత్ డంగత్ ఈరోజు తెలిపారు. భూగర్భ మిగులు జలాలను కూడా ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని, వాననీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు. కరవు తాండవిస్తోన్న ప్రాంతాలకి నీటి సరఫరా దృష్ట్యా ప్రస్తుతం ఔరంగాబాద్, మరట్వాడా ప్రాంతాల్లో 3600 నీటి ట్యాంకర్లను ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మరట్వాడా ప్రాంతంలో గత ఐదేళ్లలో నాలుసార్లు కరవు ఏర్పడిందని పేర్కొన్నారు.