: వైఎస్సార్సీపీ నేతల దుష్ప్రచారం వల్లే ఏపీకి పరిశ్రమలు రావట్లేదు: మంత్రి శిద్ధా
వైఎస్సార్సీపీ నేతల దుష్ర్పచారం వల్లే ఏపీకీ పరిశ్రమలు రావట్లేదని మంత్రి శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీని ఆర్థికలోటు నుంచి గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తోంటే, ప్రతిపక్ష పార్టీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీరి దుష్ప్రచారం కారణంగా ఏపీకి పరిశ్రమలు రావట్లేదని శిద్ధా ఆరోపించారు.