: ‘హోదా’పై బీజేపీ నేతలు మాటమార్చడం సరికాదు: మంత్రి అయ్యన్న పాత్రుడు


భారతీయ జనతా పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై బీజేపీ నేతలు మాట మార్చడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్ల పాటు కాదు పదేళ్ల పాటు హోదా ఇవ్వాలని బీజేపీ నేతలు అన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ స్థాయి రాజధానిని ఏపీలో నిర్మిస్తామని మోదీ కూడా ఆనాడు మాటిచ్చారని ఆయన అన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అయ్యన్న మనవి చేశారు.

  • Loading...

More Telugu News