: మాటల యుద్ధం వ్యక్తుల మధ్యే!... టీడీపీ, బీజేపీల మధ్య కాదు!: ఎంపీ కింజరాపు


ఏపీకి ప్రత్యేక హోదాపై మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరగడం లేదట. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు వ్యక్తిగత స్థాయిలోనే పోట్లాడుకుంటున్నారట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విజయవాడలో టీడీపీ యువనేత, సిక్కోలు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాటల యుద్ధం జరుగుతున్నదని వ్యక్తుల మధ్యేనని ప్రకటించిన ఆయన... ఆ మాటల యుద్ధం టీడీపీ, బీజేపీల మధ్య జరుగుతున్నది కాదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడటాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రావడం తప్పేమీ కాదని ప్రకటించిన ఆయన... అయితే ఇక్కడికొచ్చే కేంద్ర మంత్రులు ప్రజలకు నిజాలు చెప్పాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News